శ్రీరాముడికి అక్క ఉందన్న విషయం తెలుసా? ఆమె ఎవరంటే..?

శ్రీరాముడు గురించి అన్ని విషయాలు మనకు తెలుసు. రామయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తల్లిదండ్రులు, భార్య, తమ్ముళ్లందరి గురించి మనకు తెలుసు. కానీ కోదండ రాముడికి ఒక అక్క కూడా ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. రాముడి సోదరి ఎవరు? ఏంటో చూద్దాం. దశరథ మహారాజ, కౌసల్యలకు శ్రీరాముడి కంటే ముందే ఒక కూతురు జన్మించింది. ఆమెకు శాంతాదేవి అని నామకరణం చేశారు. శాంతాదేవికి పుట్టకతోనే అంగవైకల్యం ఉంది. దీంతో మహర్షుల సలహా మేరకు ఆమెను దత్తత ఇచ్చారు.

శాంతాదేవిని అంగదేశ రాజైన రోమాపాదుడికి దత్తత ఇచ్చారు. అనంతరం దశరథ మహారాజు- కౌసల్య పుత్ర కామేష్టి యాగం చేశారు. అప్పుడు వారికి శ్రీరాముడు జన్మించాడు. అయితే శాంతాదేవి అంగవైకల్యానికి రోమాపాదుడు వైద్యం చేయించాడు. మంచి వైద్యం అందడంతో రూపాదేవి తిరిగి మామూలు మనిషి అయ్యింది. శాంతాదేవి గొప్ప అందగత్తె అని చెబుతుంటారు. అంగవైకల్యం నుంచి కోలుకున్నాక శాంతాదేవికి రోమాపాదుడు.. వేదాలు వల్లించడం, యుద్ధ కళ, హస్త కళల్లో శిక్షణ ఇప్పించాడట. దీంతో ఆమె వీటన్నింటిలో ప్రావీణ్యం సాధించింది. రోమాపాదుడికి శాంతాదేవిని దత్తత ఇవ్వడంతో ఆమె గురించి పెద్దగా లోకానికి తెలియలేదు.

Share this post with your friends