‘అధిక మాసం’ అంటే ఏమిటో తెలుసా?

అధిక మాసం గురించి వింటూనే ఉంటాం. అసలు అధిక మాసం అంటే ఏమిటి? ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. సంవత్సరాన్ని పంచాగ గణనం ప్రకారం సౌరమాన, చాంద్రమాన పద్ధతులలో లెక్కిస్తారు. పౌరమాన సంవత్సరం కంటే చాంద్రమాన సంవత్సరం తక్కువ వ్యవధిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాలకు మధ్య పదకొండుంపావు రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడా కారణంగా అప్పుడప్పుడు చాంద్రమాన మాసంలో సౌరమానం ప్రారంభం కాదు. అలాంటప్పుడు సూర్య సంక్రాంతి లేని చాంద్రమానానికి అధికమాసం అని పిలుస్తారు.

అలాగే సౌరమానం, చంద్రమానాల్లో ఉన్న తేడా కారణంగా సూర్యుడు ఒకే రాశిలోనే ఒక నెల కంటే ఎక్కువ కాలం సంచరించే సమయాన్ని కూడా అధిక మాసమనే అంటారు. రవి సంక్రాంతి లేని అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని ప్రామాణికంగా తీసుకుని నెలలను లెక్కిస్తూ ఉంటా. 12 రాశులలో చంద్రుడు తిరిగిన సమయాన్ని సంవత్సరంగా భావిస్తాం. ఇలా ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరించడాన్ని సౌరమానం అని.. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సౌర సంక్రమణం అని అంటారు.

Share this post with your friends