కన్యానది గురించి తెలుసా? ఆ పేరు ఎందుకొచ్చిందంటే..

హిందూమతంలో మనం దేవుళ్లతో పాటు మొక్కలను, జంతువులను, నదులను పూజిస్తూ ఉంటాం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ముఖ్యంగా నదులకు అయితే చాలా ప్రాధాన్యత ఉంది. నదులను అమ్మగా పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా గంగానదిని అయితే గంగా మాతగా పూజిస్తూ ఉంటాం. గంగలో మునిగితే సకల పాపాలు పోతాయంటారు. ఇక అలాగే నర్మదా నదికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దీనిని మోక్షదాయిని, కన్య నది, కున్వారీ నది, నర్మదాను రేవా అని కూడా పిలుస్తారు. ఈ నదిలోని ప్రతి గులకరాయిని నర్మదేశ్వర్ శివయ్యగా కొలుస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్‌కు జీవనాధారమే నర్మదా నది. ఇక్కడి వారి దాహార్తిని తీరుస్తోంది. ఇది మధ్య భారతదేశంలో ప్రవహిస్తోంది. ఇది భారత ఉపఖండంలోని పొడవైన నదులలో ఐదవది కావడం విశేషం. ఇక దక్షిణ భారత దేశంలో అయితే మూడవ పొడవైన నది.

పురాణాల ప్రకారం నర్మదా మహల్ రాజు కుమార్తె. అందమైన యువతే కాకుండా సకల గుణ సంపన్నురాలు. యుక్త వయసుకు రాగానే రాజు ఆమె స్వయంవరాన్ని ప్రకటించాడు. గుల్బకాలీ పువ్వును ఏ యువరాజు తీసుకువస్తాడో అతనితో వివాహం చేస్తానని చెప్పాడు. సోనభద్ర అనే రాకుమారుడు ఆ పువ్వును తీసుకొచ్చాడు. అయితే నర్మదకు జుహిలా అనే పని మనిషే స్నేహితురాలిగా ఉండేది. పువ్వును తీసుకొచ్చిన సోనభద్రకు జుహిలాతో నర్మద రాయబారం పంపింది. అయితే ఎంత సమయం గడిచినా కూడా జుహలా రాలేదు. ఆమెను వెదకడానికి వెళ్లిన నర్మద.. సోనభద్ర, జుహిలా కలిసి ఉండగా చూసింది. ఆ దృశ్యాన్ని చూసిన నర్మదకు విపరీతమైన కోపం వచ్చింది. ఇక మీదట తను పెళ్లి చేసుకోనని.. కన్యగా ఉంటానంటూ ప్రమాణం చేసింది.

Share this post with your friends