శ్రీశైల మల్లన్న భక్తులకు చాలా సౌకర్యాలను కలప్పించాడు. ఎక్కడ ఏ స్వామివారిని కూడా టచ్ చేసే అవకాశం మనకు ఉండదు. శ్రీగిరి వాసుడు మాత్రం తనను తాకి తరించే అవకాశాన్ని భక్తులకు కల్పించాడు. ఇక్కడ శౌచ నియమాలతోనూ.. విధివిధానాలతోనూ పని లేదు. శ్రీశైలానికి ఎలా వచ్చారో.. అలాగే తన సన్నిధికి వచ్చి ధూళితోనే తాకి తరించే అవకాశాన్ని ఒక్క మల్లన్న సన్నిధిలోనే ఉంటుంది. అసలు ధూళి దర్శనం వెనుక కారణమేంటి? భగవంతుని దర్శనమంటేనే శుచిగా.. శుభ్రంగా వెళ్లి చేసుకుంటాం కదా.. ఈయనకు ఎందుకు అలాంటివి పాటించమో చూద్దాం.
ఇప్పుడంటే శ్రీశైలానికి రవాణా సౌకర్యం మెండుగా ఉంది కానీ అప్పట్లో అలాంటిదేమీ ఉండేది కాదు.. దట్టమైన నల్లమల అడవుల్లో కాలి నడకన మైళ్ల దూరం నడిస్తే కానీ శ్రీశైల వాసుడు కనిపించేవాడు కాదు. ఈ ప్రయాణి చాలా క్లిష్టంగా ఉండేది. అందుకే ఇక్కడ విధివిధానాలు, శుచీ శుభ్రతలు పాటించనవసరం లేదు. నేరుగా క్షేత్రానికి వెళ్లి స్వామివారిని తాకి మరీ దర్శనం చేసుకోవచ్చు. క్రూర జంతువుల బారి నుంచి… ఆటవికుల బారి నుంచి తమను తాము కాపాడుకుంటూ ఎంతో శ్రమకోర్చి వచ్చేవారు కాబట్టి శ్రీశైల మల్లన్న ఎలా వచ్చినా అక్కున చేర్చుకునేవాడు. ఇప్పటికీ ధూళి దర్శనం కొనసాగుతోంది. ముందుగా ధూళి దర్శనం చేసుకుని వచ్చి.. ఆపై వీలైతే శుచిగా వెళ్లి దర్శనం చేసుకుని వస్తుంటారు.