కుంభకోణంను భాస్కర క్షేత్రమని ఎందుకు పిలుస్తారంటే..!

కుంభకోణం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తమిళనాడులోని ఒక ప్రాంతం. జగత్ సృష్టి ఇక్కడే ప్రారంభమైందని అక్కడి వారు నమ్ముతారు. 108 దివ్య తిరుపతులలో కుంభకోణం ఒకటి. అనేక ఆలయాల సమూహారమిది. సారంగపాణి, కోమలవల్లి తాయారు పేర్లతో ఇక్కడి స్వామివారు, అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడి గర్భగుడి రథం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఉత్తర వాకిలి, దక్షిణ వాకిలి ఉంటాయి. దక్షిణ వాకిలి నిత్యం తెరిచే ఉంటుంది. ఉత్తర వాకిలిని ఉత్తరాయణంలో మాత్రమే తెరుస్తూ ఉంటారు.

ఇక ఇక్కడ ఈ క్షఏత్రాన్ని భాస్కర క్షేత్రం అని కూడా అంటారు. దీనికి కారణం లేకపోలేదు. పూర్వం సూర్య భగవాడు సుదర్శన చక్రంతో పోటీ పడి తన తేజస్సునంతా కోల్పోయాడట. అప్పుడు భాస్కరుడు సారంగపాణి స్వామివారిని ఆరాధించి తన తేజస్సును తిరిగి పొందాడట. అందుకే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రమని కూడా అంటారు. అంతేకాదు.. స్థల పురాణం ప్రకారం.. ఇక్కడి స్వామివారు కూడా సూర్యుని అభ్యర్థన మేరకే ఆవిర్భవించారు. అలాగే ఇక్కడ పాతాళ శ్రీనివాసుడు కూడా ఉంటాడు. భూమికి 10 అడుగుల లోతులో ఆయన కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.

Share this post with your friends