తూర్పు దిక్కు దోషముంటే ఇలా చేయండి..

వాస్తు దోషాలు ఇంటికి.. ఇంట్లోని వారికి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని అధిగమించాలంటే ఓ మార్గం ఉంది. అదేంటంటే.. దిశానుసారంగా వివిధ దేవుళ్లను పూజించడం. ఇలా చేస్తే మనం సమస్యల నుంచి బయటపడతామని జోతిష్య పండితులు చెబుతున్నారు. వాస్తు దోషం ఉంటే మాత్రం పక్కాగా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుందట. మనం చేపట్టిన ప్రతి పనిలోనూ ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుందట. కాబట్టి వాస్తు దోషాలను పోగొట్టుకోవాలంటే మనం చేయాల్సింది ఒక్కటే. అదే దేవతారణ. సదరు దిక్కులకు సంబంధించిన దేవతల ఆరాధన.

ఒక్కో దిక్కుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటాడు. తూర్పు దిక్కుకు ప్రత్యేక్ష దైవం సూర్య భగవానుడు అధిదేవతగా పరిగణించబడుతున్నాడు. ఈ దిశలో వాస్తు దోషం ఏమైనా ఉంటే మాత్రం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయట. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయట. అలాగే ఉద్యోగ సమస్యలు, కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ వాస్తు దోష నివారణకు సూర్యునికి నిత్యం అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. దీంతో పాటు వీలయితే గాయత్రీ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటే వాస్తు దోషం తప్పక తొలగి పోతుందట.

Share this post with your friends