
మనం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలన్నా.. మన ఇంట సిరిసంపదలు నెలకొనాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కావల్సిందే. మరి మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలంటే.. తప్పనిసరిగా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా గురువారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటించాలట. అవేంటో తెలుసుకుందాం. ప్రతి గురువారం పూజా మందిరంలో ఆవు నెయ్యితో లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే దీపారాధనకు ఉపయోగించిన నూనెలో ఒక రూపాయి కాయిన్ వేయాలట.
లక్ష్మీదేవిని పూజించుకున్న అనంతరం అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే మన ఇంట ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. ఇక లక్ష్మీదేవి దగ్గర వెలిగించిన దీపం కొండెక్కిన తర్వాత మనం నూనెలో వేసిన రూపాయి కాయిన్ తీసుకుని కొత్త వస్త్రంతో శుభ్రంగా చేసి జాగ్రత్తగా ఒక చోట దాచి పెట్టాలట. 12 వారాలు ఇలా చేసిన మీదట రూపాయి కాయిన్ను మరోసారి శుభ్రంగా తుడిచి పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దాన్ని డబ్బులు దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం మనపై తప్పక ఉంటుందట.
