పూజ సమయంలో వీటిని పొరపాటున కూడా కింద పెట్టకండి..

వాస్తుశాస్త్రాన్ని అనుసరిస్తే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పొరపాటున కూడా కొన్ని వస్తువులను నేలపై పెట్టకూడదట. అలా పెడితే జీవితంలో కష్టాలు పెరుగుతాయని చెబుతారు. మరి ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. పరమేశ్వరుడిని మనం అన్ని ఆలయాల్లోనూ లింగ రూపంలోనే చూస్తుంటాం. శివలింగంలో మొత్తం విశ్వం శక్తి ఉంటుందని హిందువుల నమ్మకం. అందుకే పూజ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ పొరపాటున కూడా శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదట. శుభ్రమైన స్థలంలోనే ఉంచాలి. విగ్రహాన్ని శుభ్రం చేసే సమయంలో సైతం నేలపై ఉంచకూడదు.

అలాగే గుడిని శుభ్రం చేసేటప్పుడు కూడా విగ్రహాన్ని నేలపై ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుంది. దీనివల్ల ఇంటిలోని సుఖశాంతులు చెడిపోతాయి. పూజ సమయంలో దీపం తప్పనిసరిగా వెలిగిస్తాం. వాస్తు నియమం ప్రకారం ఈ దీపాన్ని సైతం నేలపై పెట్టి వెలిగించకూడదు. కనీసం ఒక ఆకుపై అయినా దీపాన్ని పెట్టాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత దాని కింద అక్షింతలు ఉంచాలి. అలాగే శంఖం ఊదడం కూడా పూజా విధానంలో ఒక భాగమే. ఎక్కడ శంఖం ఊదితే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెబుతారు. శంఖాన్ని ఎప్పుడూ కూడా ఖాళీగా నేలపై ఉంచకూడదు. అలా చేస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయట.

Share this post with your friends