విష్ణుమూర్తి, శివుడు, వేంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఇలా చెబుతూ పోతే.. ముక్కోటి దేవతలున్నారు. అయినా కూడా భగవంతుడు ఒక్కడే అని అంటూ ఉంటారు. అది నిజమేనా? అంటే నిజమే.. పేర్లు వేరైనా భగవంతుడు ఒక్కడే. మనం భగవంతుడిని భక్తి శ్రద్ధతో ఏ పేర్లతో పిలిచినా పలుకుతాడు. అయితే మనకు ఇష్టమైన భగవంతుడు మన కోరికలు తీర్చాడు కదా అనో.. లాభదాయకంగా ఉన్నాడనో.. ఇతర నామాలను మనం కించపరచకూడదు. భగవంతుడొక్కడే. ఆయన పేర్లే వేరువేరుగా ఉంటాయి.
ఒక్కో యుగంలో ఒక్కో అవతారమెత్తాడు భగవంతుడు. కాబట్టి అండ పిండ బ్రహ్మాండంలో దేవుడు ఒక్కడే. భూమి సారవంతంగా ఉండాలే కానీ ఏ విత్తనం నాటినా కూడా మొలకెత్తుతంది. అలాగే మన హృదయం పవిత్రంగా ఉంచుకుని సంపూర్ణ విశ్వాసంతో ఏ నామంతో భగవంతుడిని పిలిచినా మనల్ని కరుణిస్తాడు. లాభ నష్టాల బేరీజు వేసుకుని భగవంతుని ఎంచుకోవడం మహా దోషం. మన విషయంలో భగవంతుడు పరసన్నం కావాలంటే విలువలతో జీవించాలి. పరోపకార భావనలు చేయకూడదని.. పవిత్రంగా ఉండాలని పండితులు చెబుతారు.