నిశీధి సమయంలో కాలభైరవుడిని పూజించేది ఎప్పుడో తెలుసా?

హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది.మరి ఈ తిథి ఎప్పుడు వస్తుంది? ఆసక్తికరంగా జ్యేష్ట కాలాష్టమి వ్రతాన్ని నిశీధి ముహూర్తాన్ని శుభ ముహూర్తంగా పరిగణిస్తూ ఉంటారు. కృష్ణ పక్ష అష్టమి తిథి ఈ నెల 28న శుక్రవారం సాయంత్రం 04:27 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అంటే శనివారం జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 02:19కి ముగుస్తుంది. ఈ ప్రకారం చూస్తే జ్యేష్ట కాలాష్టమి ఉపవాసం జూన్ 28న మాత్రమే ఆచరిస్తారు. కాలభైరవుడిని రాత్రి పూట పూజిస్తారు. మంత్ర, తంత్ర సాధన చేసేవారు నిశీధి సమయంలో కాల భైరవుడిని పూజిస్తారు.

కాల భైరవుడంటే శివుడే. కాబట్టి దీనిని కాలభైరవాష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవాళ శివుడి రూపమైన భైరవుడిని పూజిస్తూ ఉంటాం. ఈ రోజున వ్రతం ఆచరించి ఉపవాసం చేస్తే ప్రజల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. శుభ ఫలితాలు పొందుతామట. కాలాష్టమి రోజున ఆవనూనెతో కాలభైరవుని వద్ద దీపం వెలిగించి శ్రీ కాల భైరవాష్టకం పఠించాల. ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయట. ఇవాళ శివుడికి 21 బిల్వ పత్రాలపై గంధంతో ఓం నమ: శివాయ అని రాసి స్వామివారికి సమర్పించాలి. ఇలా చస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం.

Share this post with your friends