శని జయంతి ఎప్పుడో తెలుసా? ఈసారి మరీ స్పెషల్..

హిందువులు శనీశ్వరుడిని అత్యంత భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. ప్రతి శనివారం వేంకటేశ్వరుని ఆలయానికే కాదు.. శనీశ్వరుడిని సైతం దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మన కర్మల ఆధారంగా ఫలితాన్ని ఇచ్చేది శనీశ్వరుడేనని నమ్మకం. అందుకే శనివారం తప్పక శని దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజించడం వలన శని దోషాలన్నీ పోయి.. శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. శని దోషాల కారణంగా మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వంటివి కలుగుతూ ఉంటాయి. ఇక జూన్ 6.. శనివారం శని జయంతి రానుంది. శనిదేవుడు సర్వార్థ సిద్ధి యోగంలో జన్మించాడట. కాబట్టి ఆ రోజును శని జయంతిగా జరుపుకుంటూ ఉంటాం.

అయితే ఈ ఏడాది వచ్చే శని జయంతి ఓ ప్రత్యేకత ఉంది. జూన్ 6న అంటే శని జయంతి నాడు స్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుందని నమ్ముతారు. మరి ఆరోజున శని దేవుని అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసా? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేని రావి చెట్టుకు నీళ్లు పోసి ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఇక ఆ రోజు సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే తప్పక శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆ రోజున ఉదయం నిద్రించకూడదట. శని స్తోత్రం , శని చాలీసాను పఠించాలి, ఇలా చేయడం ద్వారా శనీశ్వరుడు సంతోషించి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ రోజున నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు దానం చేస్తే మంచిదట.

Share this post with your friends