సూర్యుడు ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని ఆయనం అంటారం, ఆయనం అంటే ప్రయాణం అన్నమాట. ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం ప్రకారమైతే సూర్యుడి గమనంలో మార్పులను ఉత్తరాయణం, దక్షిణాయనం అని పిలుస్తారు. ఏడాదిలో ఆరు నెలల పాటు ఉత్తరాయణం, ఆరు నెలల పాటు దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే ఉత్తరాయణమని.. కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయమని పిలుస్తారు. సూర్యుడు సోమవారం కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి నిన్నటి నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది. మరి దక్షిణాయనంలో పుణ్యకాలం ఎప్పుడంటారా?
ఇవాళ అంటే జూలై 16 మంగళవారం నాడు కర్కాటక సంక్రమణం ఉదయం 11:18 నిమిషాలకు మొదలవుతుంది. కాబట్టి ఈ సమయం నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అయితే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిమిషాలకు పుణ్యకాలంగానూ.. 2 గంటల 16 నిమిషాల పాటు అత్యంత పుణ్యకాలమని పండితులు తెలిపారు. ఈ సమయంలో మనం చేసే కొన్ని సత్ఫలితాలను ఇస్తాయట. ఉత్తరాయణం పుణ్యకాలం దేవతలకు పగలు అని.. దక్షిణాయన పుణ్యకాలం దేవతలకు రాత్రి సమయం అని చెబుతారు.