తిరుమలలో జూన్ 22న శ్రీవారి పున్నమి గరుడసేవ

పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22న శనివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

జ్యేష్టా నక్షత్రంతో ముగిసే జ్యేష్ఠాభిషేకం రోజు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉంటే ఆ రోజు శ్రీవారి పున్నమి గరుడ సేవ కూడా కమనీయంగా జరుగుతుంది. అయితే భక్తులు తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే.. ముఖ్యంగా ఈ గరుడ సేవ చూసిన వారికి అష్టైశ్వర్యాలు తప్పక సిద్ధిస్తాయట. ఇక జ్యేష్టాభిషేకం ముగిసిన అనంతరం స్వామివారు, ఉభయ దేవేరులకు బంగారు కవచం అలంకరిస్తారు. ఈ బంగారు కవచంలోనే వచ్చే ఏడాది వరకూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను దర్శించుకుంటే ఇహ లోకంలో సకల సౌఖ్యాలు పొందుతారట. అలాగే వైకుంఠాన్ని చేరుతారని పండితులు చెబుతారు.

Share this post with your friends