మరణించిన వారి ఫోటోలు పూజ గదిలో పెట్టుకోవచ్చా?

చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. మరణించిన వారు దేవుడితో సమానం అంటారు కదా.. ఆ లెక్కన మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో ఎందుకు పెట్టకూడదు? అనే ప్రశ్న మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఈ విషయాలపై ఓసారి చర్చిద్దాం. పూజ గదిలో ప్రతిరోజు ఎవరిని పూజిస్తామో.. వారికి ధూప దీప నైవేద్యాలు చేస్తామో వారి ఫోటోలను మాత్రమే పెట్టాలి. చనిపోయిన వారి ఫోటోలు పూజగదిలో పెట్టకూడదట. అలా పెట్టాలంటే వారు పూజ్యులు, దైవ సమానులై ఉండాలట. అందరి చేతా కీర్తించబడాలట.. వారు చెప్పిన మాట చెప్పినట్టుగా ఆచరించబడితే గానీ అటువంటి వారి ఫోటోలనే పూజ గదిలో పెట్టాలట.

బతికుండగానే అన్నం పెట్టాలి.. గౌరవించాలి. అదేమీ లేనప్పుడు చనిపోయిన తర్వాత పెట్టి ఏం ప్రయోజనమని పండితులు అంటున్నారు. ఇంట్లో వంశపారంపర్యంగా ఐదారు తరాల వారి ఫోటోలు కూడా పెట్టుకునే వారున్నారు. దీనిలో తప్పేమీ లేదట. పూజ గది మినహా చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టినా కూడా ఇబ్బందేమీ లేదట. ఇంట్లో వంశపారంపర్యంగా ఫోటోలు ఉన్నాయి కదాని.. వారందరి ఫోటోలు దేవుడి గదిలో పెడతాం అంటే మాత్రం కుదరదట. వారు దైవ సమానులై ఉండటమే కాకుండా.. వారిని నిత్యం ధూప దీపాలతో పూజించదలుచుకుంటే మాత్రమే పెట్టాలట. లేదంటే వద్దని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends