తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 21వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 20వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మే 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సైతం నేటితో ముగియనున్నాయి.
మే 21న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 20న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇవాళ ఉదయం స్వామివారి చక్రస్నానం శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఇక ఈ రోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు.