శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు..

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నేడు అభిషేకం, తిరుమంజనం, ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 18న మహాపూర్ణాహుతి, చక్రస్నానంతో ముగియనున్నాయి. జూన్ 17వ తేదీన రాత్రి 7:30 గంటలకు రంగనాథ స్వామి వారి తిరుకల్యాణం వైభవంగా జరగనుంది. ఈ నెల 18న మహా పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నాలుగు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తమిళనాడు శ్రీరంగంలోని రంగనాయకాయక స్వామిని తలపించేలా నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామంలో గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం ఈనాటిది కాదు. సుమారు 800 ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది. వింజూరు వంశానికి చెందిన నరసింహ చార్యుల వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్మించుకుని అదే ప్రతిమను శ్రీపురం గ్రామంలో ప్రతిష్టించారు. ఈ ఆలయం నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

Share this post with your friends