నేడు నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకూ జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకూ.. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వాహనసేవలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్నారు. ఈ నెల 28న స్వామివారికి కల్యాణోత్సవం జరగనుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

22-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం

23-05-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం

24-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం

25-05-2024
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం

26-05-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం

27-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం

28-05-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం, క‌ల్యాణోత్స‌వం

29-05-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం

Share this post with your friends