
ఒకనాడు లింగావిర్భావ కాలములో ఒకానొక కల్పంలో బ్రహ్మకి.. శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొర విన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారి మధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మ హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కునేందుకు వెళ్ళారు. బ్రహ్మ వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి కింద పడి ఉండటం కనిపించింది.
దానిని ‘నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని అడిగితే మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ‘నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను కింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?’ అని అడిగింది. అప్పుడు బ్రహ్మ ‘నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమి కావాలి మీకు? అని అడిగింది మొగలిపువ్వు. ఆయన ‘కింద శ్రీమన్నారాయణుడు ఉంటాడు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా?’ అని అడిగాడు. మొగలిపువ్వు చెబుతాను అన్నది. బ్రహ్మ మొగలిపువ్వుతో కలిసి కిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగితే విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
