కిన్నౌర్ కైలాష్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కిన్నౌర్ కైలాష్ పర్వతం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీనిని ప్రస్తుతం కిన్నార్ కైలాష్ అని పిలుస్తున్నారు. ఈ పర్వతంపై ఒక ఐస్ బ్లాక్ ఉంటుంది. ఇది ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సహజ శివలింగం రంగు పగటి సమయంలో మారుతూ ఉంటుంది. ఈ శిల 20 వేల అడుగుల ఎత్తైన కిన్నౌర్ కైలాష్ శ్రేణిలో కైలాష్ పర్వతం, జోర్కాండెన్ పర్వతాల మధ్య ఉంది.
ఇది అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది ఏడాదిలో ఒక నెల మాత్రమే చేసే యాత్ర. ఈ నెలలో మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది. చాలా క్లిష్టతరమైన యాత్ర. మానసరోవరం, అమర్‌నాథ్ యాత్ర కంటే కిన్నౌర్ కైలాష్ ప్రయాణం చాలా కష్టం. ఈ ప్రయాణం దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది. దీనిని దర్శించుకునేందుకు భక్తులు అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. పురాణాల ప్రకారం శివపార్వతులు మొదటిసారి ఈ పర్వతంపైనే కలుసుకున్నారట. ఇక్కడే ఒకరినొకరు చూసుకున్నారట. అప్పుడే అక్కడ బ్రహ్మకమలం వికసించిందట. ఈ బ్రహ్మకమలం యాత్ర చేసిన వారిలో కొందరికే కనిపిస్తుందని చెబుతారు.
పురాణాల ప్రకారం శివపార్వతులు మొదటిసారి కలుసుకున్నది ఈ పర్వతం మీదనే.. అంటే వీరిద్దరూ ఈ ప్రదేశంలో మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నారు. శివుడు, పార్వతి కలుసుకున్నప్పుడు, ఈ ప్రదేశంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది, దీని కీర్తి ప్రపంచం అంతటా వ్యాపించింది. ఈనాటికీ కిన్నౌర్ కైలాస యాత్రలో బ్రహ్మకమలం పుష్పాలు తరచుగా కనిపిస్తాయని చెబుతారు. అయితే మనస్సు స్వచ్ఛంగా, శివయ్య మీద భక్తితో నిండిన వారికే ఈ పుష్పం కనిపిస్తుందని నమ్మకం.