మొట్టమొదటిసారిగా ‘‘గోవింద కోటి’’ని రాసిన బెంగుళూరుకు చెందిన కుమారి కీర్తన

మొట్టమొదటిసారిగా బెంగుళూరుకు చెందిన ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు ‘‘గోవింద కోటి’’ని రాసింది. శ్రీవారి అనుగ్రహంతో కుమారి కీర్తన ఉజ్వల భవిష్యత్‌ పొందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నామని టీటీడీ బోర్డు తెలిపింది. అలాగే మనం కూడా ఈ చిన్నారి అత్యున్నత స్థాయిని పొందాలని ఈ తిరుమలేశుడిని ప్రార్థిద్దాం.

విద్యార్థులు, చిన్న పిల్లలు, యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి ప్రవేశపెట్టిన విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, కోటి సార్లు గోవిందా కోటి రాసిన వారికి, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి నిర్ణయించింది.

Share this post with your friends