అష్టలక్ష్మీ కుబేర మంత్రం పఠిస్తే ఎన్ని లాభాలంటే..

శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శుభ శుక్రవారం నాడు, గృహంలో శాంతి, సౌభాగ్యాలు పెంపొందాలని కోరుకుంటూ.. విశేష ఫలితాలను ఇచ్చే మంత్రమే అష్టలక్ష్మీ కుబేర మంత్రం. దీనిని ప్రతి శుక్రవారం నాడు 108 సార్లు జపిస్తే ఆ గృహంలో శాంతి, సౌభాగ్యాలు పెంపొందుతాయట. అలాగే ఆర్థికంగా కూడా ఇల్లు చాలా బాగుంటుంది. మహాలక్ష్మీ సమేతంగా కుబేరుని పూజించడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని పండితులు చెబుతారు. ముఖ్యంగా భక్తుల ప్రార్థనలతో కుబేరుడు త్వరగా సంతోషిస్తాడు. కాబట్టి కుబేర మంత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు.

అష్టలక్ష్మీ కుబేర మంత్రం పఠిస్తే ఎన్ని లాభాలంటే..
అష్టలక్ష్మీ కుబేర మంత్రం పఠిస్తే ఎన్ని లాభాలంటే..

ఎనిమిది మంది లక్ష్మీ స్వరూపాల వైభవాన్ని, కుబేర స్వామి అనుగ్రహాన్ని ఈ అష్టలక్ష్మీ కుబేర మంత్రం గుర్తు చేస్తుందట. ఈ మంత్రాన్ని శుక్రవారం నాడు ఆలకించడం వల్ల మనసులోని ఆందోళనలు, ఆటంకాలు తొలగిపోయి, ఇంటా బయటా అద్భుతమైన సానుకూలత ఏర్పడుతుంది. ఇది మన వృత్తి ధర్మాలలో స్థిరత్వాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. అంతేకాకుండా కుబేరుడు సంపద, వైభవం, శ్రేయస్సుకు చిహ్నం. అలాంటి కుబేరుడిని ‘యక్ష రాజు’ , ‘దేవతల ఖజానా’ అని కూడా పిలుస్తారు. శుక్రవారం నాడు మాత్రమే కాకుండా దీపావళికి ముందు ధనతేరస్ నాడు కుబేరుడిని సంపదకు దేవత అయిన మహాలక్ష్మితో పాటు పూజిస్తారు.

Share this post with your friends