అలా జరిగితే మాత్రమే అయ్యప్ప వివాహం చేసుకుంటాడట..

అయ్యప్ప స్వామివారి దగ్గరకు వెళ్లే వారికి కొన్ని నియమాలు ఉంటారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే పదేళ్ల లోపు చిన్నారులు కానీ.. 60 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వీలుంటుంది. అయ్యప్ప స్వామి మాలధారణ కూడా ఈ వయసు మహిళలు, ఆడపిల్లలు మాత్రమే మాల వేసుకుంటారు. మాల వేసుకున్నప్పుడు అత్యంత నిష్టగా వ్యవహరించాలి. చన్నీటి స్నానం, నేలపై పడుకోవడం వంటి ఎన్నో నియమాలు ఉంటాయి. ఈ నియమాలన్నింటినీ పాటించగలిగిన వారు మాత్రమే మాలధారణ చేస్తుంటారు.

అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములకు 18 సంవత్సరములకు.. 18 పేర్లున్నాయని తెలుసుకున్నాం. వీరిలో కన్నెస్వామికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కన్నెస్వామి అంటే మరెవరో కాదు తొలిసారి మాల ధారణ చేసిన వ్యక్తిని కన్నెస్వామిగా పిలుస్తాం. అయితే అయ్యప్ప స్వామి తన దర్శనం కోసం కన్నెస్వామి ఎప్పుడైతే రాడో అప్పుడే పెళ్లి చేసుకుంటానని వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మచారి అయిన మణికంఠుడిని వివాహం చేసుకోవాలనుకొన్నది మల్లికాపురథమ్మ ప్రతి ఏటా శబరిమలకు వస్తుందట. అయితే శబరిగిరికి వచ్చిన కన్నె స్వాములను చూసి నిరాశగా వెనుదిరిగుతుందని చెబుతారు.

Share this post with your friends