ఆగష్టు ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది.. ఇక ఆలస్యం చేయకుండా కోనేయండి..!

లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

ఏడాదిలో శ్రావణం లాంటి సందడిమాసం మరొకటి లేదు. ఒకపక్క ఎటుచూసినా సమృద్ధిగా వర్షాలు పడుతుంటాయి. ఈ మాసమంతా పండుగ వాతావరణమే నెలకొంటుంది. మహిళలు వ్రతాలతో శ్రావణ మాసానికి కొత్త వన్నెలద్దుతారు. ఇంటింటా పేరంటాలతో… ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మా వాయినం అంటూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పసితనం నుంచి అలవాటు చేసే మన సంప్రదాయాలకు పట్టుగొమ్మ శ్రావణమాసమే. ఈ మాసంలోనే సర్వశుభాలనూ ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం (ఆగస్టు 16) వస్తుంది. ఆనాడు మహిళలందరూ వరలక్ష్మిని పూజించి, తోటి ముత్తయిదువలకు శనగల వాయినం, పండు పువ్వులతో తాంబూలాలు అందిస్తుంటారు. చిత్తడి చినుకుల మధ్య పసుపు పారాణి పాదాలతో నడయాడే లక్ష్మీస్వరూపాలుగా మహిళామణులు గోచరిస్తారు.

Click Here For August 2024 Bhakthi Magazine Online Edition

సోదరీ సోదరుల మధ్య అనురాగాన్ని పెంపొందించే రాఖీ పండుగ కూడా ఈ మాసంలోనే (19) వస్తుంది. ఆడపడుచులు తమ అన్నలకు, తమ్ముళ్లకు రక్షలు కడతారు. అన్నివేళలా తమకు తోడుగా నిలబడతామని సోదరుల నుంచి వాగ్దానం అందుకుంటారు. ఇక నీలిమేఘాల రాకతోనే నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు అవతరించిన జన్మాష్టమి కూడా శ్రావణమాసం బహుళపక్షంలోనే (ఆగస్టు 26) వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ. భక్తులతో ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహిస్తారు. పిల్లలందరూ ఆడామగా తేడాలేకుండా బాలకృష్ణులుగా మారిపోతారు. ఉట్టికొట్టే వేడుకలతో… శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు వండి భక్తులకు పంచడంలో భక్తులందరూ సందడిగా గడుపుతుంటారు. ధర్మరక్షణకు అవతరించిన శ్రీకృష్ణదేవుడు మనల్ని దుష్టశక్తుల బారినుంచి కాపాడాలని కోరుకుందాం. చల్లని తల్లి అయిన మహాలక్ష్మి సిరిసంపదలు అనుగ్రహించాలని వేడుకుందాం. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలందరూ ఇంటివద్దనే స్వయంగా వ్రతాన్ని ఆచరించేందుకు వీలుగా సమగ్రమైన పూజావిధానాన్ని ఈ సంచికతో పాటు
అందిస్తున్నాం. అందుకోండి.

ఇలా అనేక అంశాలతో ఆగష్టు ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది. కొన్న వారికి తక్షణమే తమ DASHBOARD లోకి పత్రిక వచ్చేస్తుంది. అందులోని పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.

ఇక్కడ క్లిక్ చేయండి.. ఆగష్టు ఆన్లైన్ భక్తి పత్రికను పొందండి..!

Share this post with your friends