సీతమ్మ అప్పట్లో రాళ్లను దంచి నుదుటన బొట్టు పెట్టుకునేవారట.. ఆ రాళ్లు ఇప్పటికీ అక్కడే..!

రామాయణ కాలంలో పసుపు, కుంకుమలు ఉన్నాయా? ఉంటే ఓకే.. లేకుంటే సీతమ్మ బొట్టు ఎలా పెట్టుకునేవారు? అనే సందేహం రాక మానదు. అమ్మవారు ఓ గుట్టలోని పసుపు, కుంకుమ వర్ణం రాళ్లను దంచి నుదుటన బొట్టు పెట్టుకునే వారట. ఇంతకీ ఆ గుట్ట ఎక్కడుంది? అంటారా? మన భద్రాచలానికి సమీపంలోనే. దుమ్ముగూడెం సమీపంలోని పర్ణశాల ఉంది. త్రేతా యుగంలో సీతారాములు ఇక్కడే వనవాసం చేశారని ప్రతీతి. ఈ పర్ణశాలకు సమీపంలోనే లక్ష్మణ గుట్ట ఉంది. లక్ష్మణుడు పహారా కాసిన ప్రదేశమని కూడా భక్తులు చెప్పుకుంటారు.

ఈ గుట్ట 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక ఈ గుట్టపైన రాళ్లనే సీతమ్మ వారు దంచి నుదుటన బొట్టు పెట్టుకునేవారట. ఇప్పటికీ ఆ రాళ్లు అక్కడ లభిస్తుంటాయి. లక్ష్మణ గుట్ట నుంచి 9 కిలో మీటర్లు దూరం వెళితే సీత వాగు ఉంటుంది. ఈ సీత వాగు దగ్గర సీతమ్మవారి పసుపు, కుంకుమ రాళ్లను విక్రయిస్తూ ఉంటారు. సీతవాగును దర్శించుకునే భక్తులు అక్కడి నుంచి తప్పనిసరిగా ఆ రాళ్లను కొని తెచ్చుకుంటారు. ఈ రాళ్లు కొన్ని పసుపు రంగులోనూ.. మరికొన్ని ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని పగులగొట్టి చూస్తే మరింత ముదురు రంగు కనిపిస్తుంది.

Share this post with your friends