నిజంగానే తథాస్తు దేవతలుంటారా?

హిందూ సంప్రదాయం ప్రకారం సాయంత్రం వేళ తదాస్తు దేవతలు ఉంటారని అంటారు. సాయంత్రం వేళ అశుభం మాట్లాడకూడదని కూడా చెబుతుంటారు. మరి ఇందులో నిజముందా? నిజంగానే తథాస్తు దేవతలు ఉంటారా? మనం ఏం మాట్లాడినా తథాస్తు అనేస్తారా? అంటే ఇది అక్షరాలా నిజమని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో అంతరిక్షంలో చారణులు అనే దేవతలు సంచరిస్తూ ఉంటారట. ఆ తరుణంలో మనం ఏం మాట్లాడినా తథాస్తు అంటారట. అందుకే మనం మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి సాయంత్రం వేళ చెడు మాట్లాడకూడదు.

ఆ సమయంలో అసుర గణాలు ఉంటాయి కాబట్టి మన రెండో మాట వినకుండా మొదటి మాటకే తథాస్తు అనేస్తారట. మనం అశుభం అనుకుంటే అశుభం.. శుభం జరగాలనుకుంటే శుభం జరుగుతుందట. కనుక మంచి జరగాలని కోరిక ఉన్న వారు అసుర సంధ్యవేళ అంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుందట. పొరపాటున ఏదో అనుకుని ఆ తరువాత నాలుక కరుచుకున్నా ఉపయోగం ఉండదట. ముందుగా అన్న మాటకే దేవతలు తథాస్తు అనేస్తారట. కాబట్టి సాయంత్రం వేళ పూజ చేసుకోవాలట. మంచే మాట్లాడుకోవాలి. చారిణుల గురించి రామాయణంలోని సుందరకాండ పారాయణంలో ఉంటుంది.

Share this post with your friends