విష్ఱు మూర్తి స్వరూపమైన రావి చెట్టుపై రాత్రి పూట దుష్టశక్తులుంటాయా?

రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతుంటారు. అది ఎంతవరకూ నిజం అనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తూనే ఉంటుంది. అంతేకాదు రాత్రి పూట రావి చెట్టును తాకకూడదని కూడా అంటుంటారు. రాత్రి వేళ చెట్టు ఆకులు తెంపకూడదంటారు కానీ అసలు చెట్టునే తాకవద్దనడమేంటనే సందేహమూ వస్తూ ఉంటుంది. అసలు దీని వెనుక అసలు విషయమేంటో తెలుసుకుందాం. రావి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటారు. పూజా కార్యక్రమాలన్నీ ఈ రావి చెట్టు కిందే చేస్తారు. ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకం.

విష్ణు స్వరూపంగా భావించే రావిచెట్టుపై దుష్టశక్తులు ఉండటమేంటి? అంటే ఇక్కడ దుష్టశక్తుల వంటివేమీ ఉండవు. రాత్రి వేళ చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను గాలిలోకి విడుదల చేస్తాయి. అది మన శరీరానికి అంత మంచిది కాదు. ఎక్కువ సేపు కార్బన్ డయాక్సైడ్ పీలిస్తే శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గి కాస్త ఇబ్బందికి గురవ్వాల్సి వస్తుంది. అందుకే రాత్రి సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్లకూడదని అంటారు. రావిచెట్టును హిందువులు దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. రావిచెట్టులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడుఉంటారని ప్రతీతి. ఇక రావి చెట్టు ఆకులలో సకల దేవతలు ఉంటారని పురాణాలలో చెప్పబడింది. ఇక రావిచెట్టుపై దుష్టశక్తులుంటాయనేది పచ్చి అబద్ధం.

Share this post with your friends