ఇవాళ్టి నుంచి రిషికేష్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో నేడు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి సాయంత్రం పెద్ద శేష వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 20వ తేదీ సాయంత్రం సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వహించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుంచి 9 గంట‌ల వ‌ర‌కూ.. రాత్రి 7 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కూ స్వామివారి వాహ‌న సేవ‌లు నిర్వహిస్తారు.

వేంకటేశ్వర స్వామివారి వాహన సేవలు..

22-05-2024
ఉదయం – చిన్న‌శేష వాహ‌నం,
సాయంత్రం – హంస వాహనం

23-05-2024
ఉదయం – సింహవాహనం,
సాయంత్రం – ముత్య‌పుపందిరి వాహ‌నం

24-05-2024
ఉదయం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం,
సాయంత్రం – స‌ర్వ‌భూపాల వాహ‌నం

25-05-2024
ఉదయం – మోహిని అలంకారం,
సాయంత్రం – గ‌రుడ‌వాహ‌నం

26-05-2024
ఉదయం – హ‌నుమంత వాహ‌నం,
సాయంత్రం – గ‌జ‌వాహ‌నం

27-05-2024
ఉదయం – సూర్యప్ర‌భ వాహ‌నం,
సాయంత్రం – చంద్ర‌ప్ర‌భ వాహ‌నం

28-05-2024
ఉదయం – ర‌థోత్స‌వం,
సాయంత్రం – అశ్వ‌వాహ‌నం

29-05-2024
ఉదయం – చ‌క్ర‌స్నానం,
సాయంత్రం – ధ్వజావరోహణం

Share this post with your friends