జూన్ 2 నుంచి రిషికేష్‌ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 2 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం అంకురార్పణం, మూషిక వాహనసేవ నిర్వహిస్తారు. ఇక జూన్ 2 నుంచి వివిధ రకాల వాహన సేవలను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనునున్నారు. జూన్ 6వ తేదీన ధ్వజావరోహణం, రావణాసుర వాహనంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

వాహన సేవల వివరాలు..

02-06-2024
ఉదయం – ధ్వజారోహణం, కల్పవృక్షవాహనం
సాయంత్రం – హంస వాహనం

03-06-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం

04-06-2024
ఉదయం – శేషవాహనం
సాయంత్రం – గజవాహనం

05-06-2024
ఉదయం – సింహవాహనం
సాయంత్రం – కల్యాణోత్సవం, వృషభవాహనం

06-06-2024
ఉదయం – త్రిశూలస్నానం, తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – ధ్వజావరోహణం, రావణాసుర వాహనం

Share this post with your friends