మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం అక్టోపస్ భవనం నుండి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా 8 బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 60 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 50 వేల మందికి అన్నప్రసాదాలు (ఇందులో ఉప్మా, పొంగల్ ఉన్నాయి) పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు. అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.