చదువుల తల్లిగా పిలుచుకునే సరస్వతీ దేవి ఆలయాలు మనకు పెద్దగా కనిపించవు. చాలా తక్కువ ఉంటాయి. సంఖ్యా పరంగా తక్కువగా ఉన్నా కూడా ప్రత్యేకతను అయితే కలిగి ఉంటాయి. అటువంటి వాటిలో మెదక్ జిల్లా సిద్దిపేట డివిజన్‌లోని అనంత సాగర్ గ్రామంలో నెలకొన్న క్షేత్రం కూడా ఒకటి. అనంతసాగర్ గ్రామ శివారులో ఒక చిన్న కొండ మీద సరస్వతీ దేవి కొలువై ఉంది. చుట్టూ చెట్లు, కొండలు దొనెలతో చూడటానికి ఈ ప్రదేశం చాలా రమ్యంగా ఉంటుంది. అన్ని ఆలయాల్లో సరస్వతీ దేవి పద్మంలో కూర్చొని ఉంటే ఇక్కడ మాత్రం నిలుచుని ఉంటుంది. చేతిలో వీణ, పుస్తకం, జపమాల ధరించి ఉంటుంది. ఇక సరస్వతీదేవి ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి.
కుడివైపు ఉపాలయంలో సౌభాగ్యలక్ష్మి, ఎడమవైపు దక్షిణ కాళి కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయానికి సమీపంలో మూడు చిన్న చిన్న గుహలున్నాయి. వాటిలో జలాశయాలు సైతం ఉన్నాయి. వాటిని రాగి దొనె, పాల దొనె, చీకటి దొనె అనే పేర్లతో పిలుస్తారు. ఈ జలాశయాల్లోని నీటిని తాగే ఎలాంటి వ్యాధి అయినా నయమవుతుందని నమ్మకం. ఇక్కడ నీటిని తీసుకెళ్లి పొలాల్లోనూ జల్లుతారు. దీంతో చీడపీడలన్నీ పోతాయని నమ్మకం. అసలీ ఆలయ నిర్మాణం వెనుక ఓ కథ ఉంది.