తిరుచానూరు (తిరుపతి జిల్లా): ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పద్మ సరోవరంలో తెప్పలపై అమ్మవారి విహారం. ప్రతి ఏటా జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారికి తెప్పోత్సవాలు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవలు రద్దు.
2024-06-05