కర్తరి సమయంలో ఏ ఏ పనులు నిషిద్ధమంటే..

శుభకార్యాలకు సుముహూర్తం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాల కోసం నక్షత్రాలు ప్రధానంగా చూస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం మొత్తంగా 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాల్లో సైతం సమూహాలు ఉన్నాయి. భరణి, రోహిణి నక్షత్రాలను అగ్ని సంబంధిత నక్షత్రాలుగా పరిగణిస్తారు. కర్తరి అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు భరణీ నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశించడం నుంచి ప్రారంభమవుతుంది. వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకూ ఉంటుంది. నక్షత్ర స్వభావాల రీత్యా కర్తరి ఉండే నక్షత్రాలు భూ, అగ్ని సంబంధిత నక్షత్రాలుగా పేర్కొంటారు.

కర్తరి సమయంలో ఏ ఏ పనులు నిషిద్ధమంటే..
కర్తరి సమయంలో ఏ ఏ పనులు నిషిద్ధమంటే..

ముఖ్యంగా ఈ కర్తరి సమయంలో ఏ పనులు నిషిద్ధమో తెలుసుకుందాం. భూమికి సంబంధించిన పనులన్నీ నిషిద్ధమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. భూ సంబంధిత పనులు అంటే అందరికీ తెలిసినవే. భూమిని తవ్వడం, చెట్లు నాటడం, బావులు, చెరువులు తవ్వడం వంటివి కర్తరి సమయంలో చేయకూడదు. అలాగే అగ్ని సంబంధిత నక్షత్రాలు కూడా కావడంతో మరికొన్ని పనులు కూడా నిషిద్ధం. అవేంటో కూడా జోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంటికి కప్పు వేయడం, గుమ్మాలు పెట్టడం, ఇల్లు, ఫ్యాక్టరీల నిర్మాణాలకు శంకుస్థాపన, భూమి పూజ చేయడం, ఇంటి గృహప్రవేశం వంటివన్నీ నిషిద్ధమని పండితులు పేర్కొంటున్నారు.

Share this post with your friends