సింధూరంతో శ్రీ బాలాంజనేయ స్వామి వారికి అభిషేకం

తిరుమ‌ల‌లో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థలమైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో జయంతి ఉత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నారు. చివరి రోజైన నేడు స్వామివారిని సింధూరంతో అర్చకులు అభిషేకించారు. జూన్ 1వ తేదీ నుంచి స్వామివారికి పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తూనే ఉన్నారు. జూన్ 1వ తేదీన మల్లెపూలతోనూ.. 2వ తేదీన తమలపాకులతోనూ.. 3వ తేదీన ఎర్ర గన్నేరు, కనకాంబరాలతో అభిషేకం నిర్వహించారు.

ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన‌ చామంతి పుష్పాల‌తో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు సంతానం, భూవివాదాలు, తదితర సమస్యలు తొలగిపోవాలంటే హనుమంతుని సేవించడం శ్రేష్టమని, ఆంజనేయస్వామి వైభవం గురించి వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృత స్నప‌న తిరుమంజ‌నం జరిగింది. శ్రీ ఆంజనేయ సహస్రనామార్చనలతో పాటు అత్యంత ఘనంగా మంత్రోచ్ఛారణల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. నేటితో స్వామివారి జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends