రోళ్లు పగిలే ఎండలో లోక కల్యాణార్థం అగ్ని తపస్సు చేస్తున్న సాధువు

అసలే ఎండాకాలం.. పైగా రోళ్లు పగిలే కాలం.. సాధారణ ప్రాంతాల్లోనే వేడి మంటలు పుట్టిస్తోంది.ఇక రాజస్థాన్‌లో మామూలుగానే ఎడారి ప్రాంతం కావడంతో ఎండలు బాగా ఎక్కువ. ఇక సమ్మర్‌లో నిప్పుల కొలిమే అని చెప్పాలి. అలాంటి నిప్పుల కొలిమిలో ఓ సాధువు 41 రోజుల పాటు రోజుకు 4 గంటల పాటు అగ్ని సమిధల ను ఏర్పాటు చేసుకుని వాటి మధ్య కూర్చుని తపస్సు చేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలోని హింగ్వా గ్రామంలోని నాథ్ శాఖకు చెందిన పురాతన సిద్ధపీఠ్ ఆశ్రమంలో విజయనాథ్ యోగి అనే సాధువు ఈ అగ్ని తపస్సు నిర్వహిస్తుండటం విశేషం. ఇంత వేడిలో అంత కఠిన తపస్సు చేస్తున్న సాధువను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

40 ఏళ్లుగా సిద్ధపీఠ్ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న మహంత్ బాబా లక్ష్మణ్ నాథ్ శిష్యుడే విజయనాథ్ యోగి. ఈ నెల 15 నుంచి ఈ తపస్సును ఆయన తపస్సును ఆరంభించారు. వచ్చే నెల 25 వరకూ కొనసాగనుంది. విజయనాథ్ యోగి ఈ తపస్సును తొమ్మిది అగ్ని సమిధల మధ్య కూర్చొని నిర్వహిస్తున్నారు. గత 20 ఏళ్లుగా విజయనాథ్ యోగి ఈ అగ్ని తపస్సు నిర్వహిస్తున్నారట. ఇదంతా లోక కల్యాణార్థమేనని ఆయన చెబుతున్నారు. ఈ తపస్సు మొత్తం మధ్యాహ్న సమయంలో చేస్తున్నారు. ఇంతటి కష్టతరమైన తపస్సును చూసేందుకు జనం భారీగా ఈ ఆశ్రమానికి తరలి వస్తున్నారు. నాథ్ శాఖకు ప్రధాన కేంద్రమైన సిద్ధపీఠ్ ఆశ్రమంలో అనేక మంది సాధువులు, మహాత్ములు నివసిస్తున్నారు.

Share this post with your friends