
ముస్లిం దేశాల్లోనే అది కూడా ప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా కలిగిన దేశంలో రామాయణం ప్రదర్శన అంటే సాధారణ విషయం కాదు. పైగా కేవలం దేశ జనాభాలో 2 శాతం మాత్రమే జనాభా ఉన్నారంటే.. అది మరింత ఆసక్తికరం. ఇక్కడ రామాయణం మాత్రమే కాదు.. హిందూ పండుగ అయిన దీపావళిని సైతం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇంతకీ ఏంటా దేశం అంటారా? ఇండోనేషియా. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. ఇక్కడి ఉన్న రెండు శాతం మాత్రమే హిందువులు ఉన్న ఈ దేశంలో నిత్యం రామాయణ బ్యాలెట్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
నేటికీ ఈ దేశంలో వేలల్లో హిందూ దేవాలయాలున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో రామ్ లీలా కార్యక్రమాన్ని అత్యంత వైభంగా జరుపుకుంటారు. ఈ పండుగను వీధుల్లో నిర్వహిస్తారు. దీనిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాభా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ హిందువులే కాదు.. దేశం మొత్తం రామ్‌లీల కార్యక్రమాన్ని దీపావళి సమయంలో జరుపుకుంటుంది. పైగా ఇక్కడి ముస్లిం కళాకారులు స్వయంగా రాముడు, సీత, హనుమంతుడి పాత్రలు పోషిస్తారు. దీనిని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాభా ఇక్కడకు వస్తుంటారు.
