టిటిడి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యరంగాల్లో ఇతోధిక సేవలు అందిస్తోంది.
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియేట్, పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టిటిడి కళాశాలలు, ఉన్నత పాఠశాలలు 98 శాతం ఫలితాలు సాధించాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇందుకు కృషి చేసిన జేఈవో, డిఈవో, ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లు ఇతర బోధనా సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నామని టీటీడీ బోర్డు తెలిపింది.