శక్తిని కోల్పోతావని బ్రహ్మకు శివుడి శాపం.. తర్వాతేం జరిగిందంటే..

తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న తిరుపత్తూరులో ఉన్న బ్రహ్మపురీశ్వర ఆలయం వెనుక ఆసక్తికర కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఈ సృష్టినంతటినీ తనే సృష్టిస్తానన్న గర్వం బ్రహ్మలో ఉండేదట. ఆ గర్వంతోనే తాను శివుని కంటే కూడా గొప్పవాడినని విర్రవీగేవాడు. విషయాన్ని గ్రహించిన శివుడు.. బ్రహ్మ దేవుని అహంకారానికి సరైన గుణపాఠం చెప్పాలని భావించాడట. దీంతో బ్రహ్మ దేవుని ఐదో ముఖాన్ని ఖండించాడట. నాటి నుంచి బ్రహ్మ.. నాలుగు ముఖాలతో చతుర్ముఖ బ్రహ్మగా మారాడు. బ్రహ్మదేవుని తలను ఖండించడంతో పాటు బ్రహ్మదేవుడు సృష్టించే శక్తి కోల్పోతాడని పరమేశ్వరుడు శపించాడట.

శక్తిని కోల్పోతావని బ్రహ్మకు శివుడి శాపం.. తర్వాతేం జరిగిందంటే..
శక్తిని కోల్పోతావని బ్రహ్మకు శివుడి శాపం.. తర్వాతేం జరిగిందంటే..

పరమేశ్వరుడు ఇచ్చిన శాపానికి తిరుగుండదు. మరి శాపవిమోచనం తొలగించుకోవడమెలా? దీనికోసం బ్రహ్మదేవుడు శివాలయాల సందర్శనకు బయల్దేరుతాడు. తన తీర్థయాత్రలో భాగంగా బ్రహ్మ ఈ బ్రహ్మపురీశ్వర క్షేత్రాన్ని కూడా సందర్శించాడని చెబుతారు. ఇక్కడ కొలువుదీరిని బ్రహ్మపురీశ్వరుని చుట్టూ 12 శివ లింగాలను సైతం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడట. చాలా కాలం పాటు ఇక్కడ శివుని కోసం తపస్సు చేశాడట. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు.. పార్వతి దేవితో కలిసి మగిళా వృక్షం కింద దర్శనం ఇచ్చి శాపవిమోచనం కలిగించాడు. అలాగే సృష్టి నిర్వహణ బాధ్యతను కూడా తిరిగి బ్రహ్మకు అప్పజెప్పాడట.. అలాగే ఈ మహిమాన్విత క్షేత్రంలో బ్రహ్మ దేవుడికి కూడా ప్రత్యేక క్షేత్రముంటుందని వరమిచ్చాడు. ఆ వర ప్రభావంతోనే బ్రహ్మ ఇక్కడ వెలిశాడు.

Share this post with your friends