ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో కొలువుదీరిన త్రిపురసుందరీ దేవి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. త్రిపురసుందరీ దేవి ఈ ఆలయాన్ని కోరి మరీ కట్టించుకుందని చెబుతారు. దానికి సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం. డా. ప్రహ్లాద శాస్త్రి అనే అమ్మవారు.. ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో అణుశాస్త్రవేత్తగా పని చేసేవారు. అయితే ఇలానే ఓసారి ధ్యానంలో ఉన్నప్పుడు తన కోసం ఓ గుడి నిర్మించమని త్రిపుర సుందరీదేవి ఆయన్ని ఆదేశించిందట. దాంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారట.

అనంతరం ప్రహ్లాద శాస్త్రి.. సొంతూరు వైజాగ్‌కు చేరుకుని అమ్మవారి ఉపాసకుడిగా, అమృతానంద స్వామిగా మారారు. అలా మొదటగా 1985లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. దాదాపు 10 సంవత్సరాల పాటు శ్రమించి ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయ నిర్మాణానికి తగిన చోటును వెతుకుతుండగా.. ఇక్కడ తవ్విన సమయంలో అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మహామేరువు కనిపించిందట. అనంతరం దీని గతచరిత్ర పరిశోధిస్తే.. ఈ ప్రాంతంలో దాదాపు 250 సంవత్సరాల క్రితం గొప్ప యాగం జరిగిందట. అది పూర్తికాగానే ఆ శ్రీచక్ర మహామేరువును భూమిలో నిక్షిప్తం చేసినట్లుగా తెలిసిందట. దీంతో ఆ శ్రీచక్రాన్ని ఆధారంగా చేసుకునే ఇక్కడ ఆలయాన్ని రూపొందించారని ప్రశస్తి.
