అనంత పద్మనాభస్వామి ఆలయంలో జరిగిన అద్భుతానికి కారణమేంటి?

కేరళలోని తిరువనంతపురం మునిగిపోయినా కూడా ఎందుకు అనంత పద్మనాభ స్వామివారి ఆలయాన్ని వరద నీరు చేరలేదు? అనేది అందరికీ షాకింగ్‌గా మారింది. పైగా గర్భగుడిలో ఎక్కడా తేమ కనిపించలేదు. అంతేకాకుండా కడిగి శుభ్రపరచినట్లుగా పొడిగా, సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమివ్వడంతో ఆలయ పూజారులు షాక్ అయ్యారు. వాస్తవానికి ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు.. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయ అద్భుతం నిజంగా భక్తులను హృదయపూర్వకంగా కదిలించే సంఘటన.

అనంత పద్మనాభ స్వామి నిత్యంగా దేవతలతో పూజింపబడతారు అని విశ్వాసం. ఆయన విగ్రహం పూర్తిగా నీటిలో మునిగితే ప్రళయం సంభవిస్తుందనే శాసనం ఉంది.

భారీ వర్షాలతో తిరువనంతపురం మునిగినా, స్వామి వారి గర్భగుడిలో నీరు ప్రవేశించకపోవడం.. దీపాలు నిరంతరం వెలిగిపోవడం.. పూలమాలలు తాజాగా ఉండడం ధ్వజస్తంభం కూడా తేమ లేకుండా శుభ్రముగా కనిపించడం అన్నీ ఆ పరమాత్మ అనుగ్రహానికి స్పష్టమైన సాక్ష్యం. ఇలాంటి అద్భుతాలకు శాస్త్రీయ సమాధానం ఉండదు – అది కేవలం భక్తి, విశ్వాసం, దైవ కృపతోనే అర్థం చేసుకోవాలని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఇది భక్తుల నమ్మకాన్ని మరింత బలపరచి, స్వామి వారి అఖండ పరిరక్షణ శక్తిని నిరూపించింది.

Share this post with your friends