
ఆయుర్వేదం అనేది ఋషులు మనకు అందించినది. వాటి ప్రకారం మనం తప్పక ఆచరించాల్సిన నియమాలేంటంటే..
1. అజీర్ణే భోజన విషం – గత భోజనం జీర్ణం కాకపోతే కొత్త భోజనం విషంలాంటిది.
2. అర్ధరోగహరి నిద్ర – సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది.
3. ముద్గదాలి గదవ్యాలి – అన్ని పప్పుల్లో పచ్చ పెసరే శ్రేష్ఠం.
4. భగ్నాస్థి-సంధానకరో లశునః – వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.
5. అతి సర్వత్ర వర్జయేత్ – రుచిగా ఉన్నంత మాత్రాన అతిగా తినకండి.
6. నాస్తి మూలమనౌషధం – ఔషధగుణం లేని కూరగాయలు లేవు.
7. న వైద్యః ప్రభురాయుషః – వైద్యులు దీర్ఘాయుష్షు ఇవ్వలేరు.
8. చింతా వ్యాధి ప్రకాశాయ – ఆందోళన వ్యాధిని మరింత పెంచుతుంది.
9. వ్యామశ్చ శనైః శనైః – వ్యాయామం నెమ్మదిగా చేయాలి.
10. అజవత్ చర్వణం కుర్యాత్ – ఆహారాన్ని మేకలా నెమ్మదిగా నమలాలి.
11. స్నానం మనఃప్రసాధనకరం – స్నానం డిప్రెషన్, చెడు కలలను తొలగిస్తుంది.
12. న స్నానమాచరేద్ భుక్త్వా – ఆహారం వెంటనే స్నానం చేయరాదు.
13. నాస్తి మేఘసమం తోయం – వర్షపు నీటితో సమానమైనది లేదు.
14. అజీర్ణే భేషజం వారి – అజీర్ణంలో నీరు ఔషధంలాంటిది.
15. సర్వత్ర నూతనం షష్టం – ఎప్పుడూ కొత్తదే శ్రేష్ఠం, కానీ బియ్యం & సేవకుడు వృద్ధమైనప్పుడే మంచివి.
16. నిత్యం సర్వ రస భక్ష్యః – ఆరు రుచులు (షడ్రుచులు) అన్నీ ఆహారంలో ఉండాలి.
17. జఠరం పూరయేదర్ధం – కడుపు సగం ఆహారం, పావు నీరు, పావు ఖాళీగా ఉంచాలి.
18. భుక్త్వా శతపథం గచ్ఛేత్ – భోజనం తర్వాత నడవాలి
19. క్షుత్సాధుతాం జనయతి – ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం రుచిగా ఉంటుంది.
20. చింతా జరా నామం – ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.
21. శతం విహాయ భోక్తవ్యం – భోజనం సమయానికి అన్ని పనులు పక్కన పెట్టాలి.
22. సర్వధర్మేషు మధ్యమామ్ – ఎల్లప్పుడూ మధ్యమార్గమే శ్రేష్ఠం.
