కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరము) :
తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంలో ప్రతినిత్యం తోమాలసేవ తరువాత తిరుమామణి మంటపంలో కొలువు జరుగుతుంది. ఇక్కడ కొలువ శ్రీనివాసుని ఒక వెండి పీఠంపైన వేంచేవు చేసి బంగారు గొడుగును అమరుస్తారు. ఇక్కడనే పంచాంగ శ్రవణం జరుగుతుంది. ముందురోజు హుండీ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను పలువురి సమక్షంలో చదువుతారు. నాణెములు, బంగారు నగలు, విలువగల రత్నముల వివరములను ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తారు. ఈ మూర్తి శ్రీవారి ఆలయంలోకి ఏ విధంగా ప్రవేశించాడో చెప్పలేము. ఈయనను దర్బారు శ్రీనివాసమూర్తి అనికూడా వ్యవహరిస్తారు.

ఉగ్ర శ్రీనివాసమూర్తి : భోగ శ్రీనివాసమూర్తి ఆలయ ప్రవేశముందు నాటి నుంచే ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయంలో వున్నట్లు తెలుస్తుంది. ఆరంభంలో ఉగ్ర శ్రీనివాసమూర్తియే ఉత్సవమూర్తిగా వ్యవహరించారు. ఈస్వామి వారి చేతిలోని చక్రము ప్రయోగించుటకు సిద్ధంగా వుంటుంది. ప్రస్తుతం ఈమూర్తి స్వామివారి చేతిలోని చక్రము ప్రయోగించుటకు సిద్ధంగా వుంటుంది. ప్రస్తుతం ఈ మూర్తి స్వామివారి మూడు ఉత్సవాలలో మాత్రమే పాల్గొనటం జరుగుతూ ఉంటుంది. అవి ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ద్వాదశారాధనం.
