హిందువులంతా ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటారు. మరి కొన్ని సమయాల్లో ఇంట్లో కూడా ముగ్గు పెట్టుకుంటాం. ముఖ్యంగా పూజల సమయంలో ఇంట్లో ముగ్గు పెడతాం. వాస్తు ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారాన్ని శక్తికి ముఖ్య ప్రవేశ ద్వారంగా పేర్కొంటారు. ప్రతికూల శక్తులను లోపలికి ప్రవేశించనివ్వకుండా ముగ్గు అడడ్ుకుంటుందట. ఇక ఇంటి లోపల ముగ్గు గీయడం అనేది అయితే వాస్తు ప్రకారం సరికాదని చెబుతారు. ఎందుకంటే ఇంట్లో ముగ్గు గీస్తే ఇంట్లోని వ్యక్తులు పొరపాటున ముగ్గుపై కాలు వేసే అవకాశం ఉంటుంది.

శుభశక్తిపై కాలు వేసినట్లే అవమానంగా భావిస్తారు. అలా తొక్కినప్పుడు ఇంట్లోకి రావాల్సిన సానుకూల శక్తిని లక్ష్మీదేవి తొలగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముగ్గు ప్రతికూల శక్తిని శుద్ధి చేసి ఇంట్లోకి పంపిస్తుందట. ఏదైనా గదిలోని మధ్యలో లేదంటే మంచం దగ్గర ఉంచితే ఆ ప్రదేశం శక్తి సమతుల్యతను దెబ్బ తీస్తుందట. అలాగే బెడ్‌రూమ్ వంటి ప్రదేశాల్లో ముగ్గు పెట్టడం వలన అక్కడ శాంతి, స్థిరత్వం దెబ్బ తింటాయని వాస్తు చెబుతోంది. కాబట్టి ఇంట్లో ముగ్గు వేయకపోవడమే ఉత్తమమని చెబుతారు. ఇక ఇంటి ముందు ముగ్గును గీసేటప్పుడు పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులను వినియోగిస్తే మంచిది. ఈ రంగులు పాజిటివ్ ఎనర్జీని.. సంపదను ఆకర్షిస్తాయి.
