దైవ ప్రసాదముతో నీకు పుత్రులు కలుగుతారు, ప్రయత్నించమని మునులు.. పాండురాజుకు చెప్పడంతో ఆక్ష్న కుంతిని పిలిచి ఏకాంతంలో తన మనోవ్యధ వివరించాడు. తన తండ్రి విచిత్ర వీర్యుడు కామశ్య వనంలో ఎప్పుడో మృతి చెందాడని.. తన తల్లికి ధర్మమయుడైన వ్యాసుని వల్ల తాను జన్మించానని తెలిపాడు. ఇప్పుడు తాను బతికుండి కూడా చచ్చిన వానితో సమానమని చెప్పాడు. సంతతి కావాలంటే దేవర న్యాయమే దిక్కని పేర్కొన్నాడు. నీ చెల్లెలు శృతసేన ఋత్విజుల వల్ల కొమాళను కన్న విషయము నీకు తెలుసునని. పుత్రుల వల్ల అనంత కోటి ఫలము కలుగుతుందని. కనుక ఈ ఆచారం ధర్మసమ్మతమని చెప్పాడు.

తన మాట విని, క్షేత్రజుడైన పుత్రుని తనకు సమర్పించాలని కుంతిని పాండురాజు కోరాడు. పతి చెప్పిన పని చేస్తే పాపము రాదని.. పుత్ర కాంక్షతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని అనడంతో కుంతిదేవి కరిగిపోయిందట. తన చిన్ననాడు దుర్వాసుడు తనకిచ్చిన మంత్రము ప్రయోగించవలసిన తన అవసరం తటస్ధించింది. మహర్షి భవిష్యద్విషయము తెలిసే కాబోలు మంత్రమిచ్చాడు. కుంతి తల ఎత్తి పాండురాజుతో ‘మహారాజా! భరత కుల శ్రేష్టుడైన నీకు భార్యనైన నేను ఒక మానవుని వల్ల సంతానము కనడమా? నేను ఒప్పుకోను’ అన్నదట. పాండురాజు తల వంచుకుని అయితే కొంప ముగిసినట్లే అన్నాడట. కుంతి – కాదు మరొక మార్గముందని చెప్పిందట. అదేదో చెప్పమని పాండురాజు అడగటంతో దుర్వాసుడు తనకు ఇచ్చిన వరం గురించి చెప్పిందట.
