పిల్లలు లేని పాండురాజుకు మునులు ఏం చెప్పారంటే..

కుంతీదేవి తనకు పుట్టిన బిడ్డను అయితే అశ్వ నదీ ప్రవాహంలో వదిలింది కానీ ఆమె గుండె తరుక్కుపోయింది. కడుపులోని దుఃఖమంతా వెళ్ళబోసుకుంది. మునీశ్వరుడు తనకు ఎందుకు అలాంటి మంత్రమిచ్చాడని విలపించింది. తెలివిమాలి అరవిందసఖుని ఆహ్వానించానని.. అతడు వచ్చి వద్దంటే సుతునెందుకు ప్రసాదించాడు? అబ్బా! సుతుడంటే సామాన్య సుతుడా? సహజ కర్ణ కుండలాల భూషితుడు. వజ్ర కవచ శోభితుడు. అలాంటి తన కన్నకొడుకు తనకు దక్కలేదని గుండెలు బాదుకుందట. ఆ తరువాత పాండురాజుని వివాహమాడింది. ఆ తరువాత ఒకానొక సమయంలో పాండురాజు తనకు రాజ్యం వద్దని ముని వృత్తి అవలంభించి తపస్సు చేసుకొంటానని తన భార్యలైన కుంతి, మాద్రిలకు చెప్పాడు. వారిని హస్తినాపురికి వెళ్లమన్నాడు.

ల్లలు లేని పాండురాజుకు మునులు ఏం చెప్పారంటే..
ల్లలు లేని పాండురాజుకు మునులు ఏం చెప్పారంటే..

తాను సన్యసించానని పెద్దలందరికి చెప్పమన్నాడు. కుంతీ, మాద్రులు విలపిస్తూ.. ” మేం వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని విడదీస్తే ప్రాణాలు విడుస్తాం” అని చెప్పారు. విధిలేక పాండురాజు వారి సహవాసం అంగీకరించాడు. విలాస వస్తువులన్నీ విసర్జించి, ఎన్నో దాన ధర్మాలు చేసి మహామునులు నివసించే శతశృంగ పర్వత ప్రాంతానికి వెళ్ళి, ఆశ్రమం కట్టుకున్నాడు. ముని వృత్తితో జీవయాత్ర సాగిస్తున్నాడు. ఒక అమావాస్య రోజున మహర్షులంతా బ్రహ్మ సందర్శనానికి సత్యలోకం వెళుతున్నారు. మార్గం సమర్ధంగా ఉంది. పాండురాజు తాను కూడా భార్య సహితంగా వెళ్ళాలని ప్రయత్నించాడు కానీ, సాధ్యపడలేదు. “అపుత్రశ్యాగతిర్నాస్తి” అనే వేధ వచనం జ్ఞప్తికి వచ్చి బాధ పడ్డాడు. నా కేది దారి? అని మునివర్యులను అడిగాడు. యోగ దృష్టిధనులైన మునులు అయ్యా! నీవు అపుత్రడవు కావు, దైవ ప్రసాదముతో నీకు పుత్రులు కలుగుతారు, ప్రయత్నించు అన్నారు.

Share this post with your friends