రేపే మదన పూర్ణిమ.. దీని ప్రత్యేకతేంటో తెలుసా?

తెలుగు నెలల విషయానికి వస్తే.. చైత్ర మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలోనే తొలి పండుగ అయిన ఉగాది వస్తుంది. అలాగే శ్రీరామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో చైత్ర శుద్ద పౌర్ణమి లేదా మదన పూర్ణిమకు చాలా ప్రాముఖ్యం ఉంది. అది రేపు అంటే 23 ఏప్రిల్‌ 2024 మంగళవారం రోజు రానుంది. మరి ఈ రోజున ఏం చేస్తే మంచిది? వంటి విషయాలను చూద్దాం. ఈ రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుతో పాటు పరమేశ్వరుడిని, హనుమంతుడిని పూజిస్తే మంచిదట. అలాగే ఈ పౌర్ణమి రోజున శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

మదన పౌర్ణమినాడు దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగంతో పాటు శివపార్వతుల కల్యాణాన్ని జరిపించారట. తత్ఫలితంగానే ఆయనకు కుమారులు జన్మించారని పండితులు చెబుతుంటారు. మదన పౌర్ణమి రోజున రామాయణ పారాయణం చేయడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతారు. అలాగే మదన పూర్ణిమ రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసినా కూడా చాలా మంచి జరుగుతుందట. అంతేకాకుండా మదన పూర్ణిమ రోజు సాయంత్రం దీపాలు వెలిగిస్తే మనకు అంతా మంచి జరుగుతుందని నమ్మకం. మదన పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది కానీ చాలా మందికి తెలియదు.

Share this post with your friends