శ్రీకృష్ణుని ఐదుగురు మాతృమూర్తుల గురించి తెలుసా?

శ్రీకృష్ణుడికి ఐదుగురు మాతృమూర్తులు. మనకు దేవకి, యశోదల గురించి మాత్రమే తెలుసు. మిగిలిన ముగ్గురి గురించి పెద్దగా తెలియదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కన్నయ్యకు తన స్తన్యమిచ్చి చంపాలనుకున్న రాక్షసి పూతనకు కూడా తల్లి స్థానమివ్వడం జరిగింది. అలాగే రోహిణి, సముఖి దేవిలు కన్నయ్య మాతృమూర్తులు. వీరిలో ముందుగా మనం దేవకి, యశోదల గురించి తెలుసుకుందాం.

దేవకి: వసుదేవుడు సతీమణి అయిన దేవకి.. శ్రీ కృష్ణుడి నిజమైన తల్లి. మధురలో ఆమె సోదరుడు కంసుడు చెరసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథిన ఆ కారగారంలోనే కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకి మాత. దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె. ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు. అయితే ఆకాశవాణి పలికిన మాటలలో.. సోదరి అష్టమి సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకుని దేవకిని ఆమె భర్త వసుదేవుడిని జైలులో బంధిస్తాడు. దేవకి దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా చెబుతారు. ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది.

ఈ కారణంగా శ్రీ కృష్ణుడిని దేవకి నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.

Share this post with your friends