కలియుగంలో నలదమయంతులను తలచుకుంటే చాలు.. సకల పాపాలూ తొలగిపోతాయని చెబుతారు. అలాంటి పవిత్రమైన జంట కథలో అక్షహృదయం అనే విద్యను గురించి చెప్పడం జరిగింది. నలుడికి ఒక శాపం కారణంగా శరీరమంతా నల్లగా మారిపోయిందట. దీంతో నలుడు ఎవరికీ కనిపించకుండా పోయాడట. అప్పుడు నలుడి ఆచూకీ కనుగొనడం కోసం దమయంతి తన సైనికులతో వెదికించి చివరకు ఎక్కడున్నాడో కనిపెట్టింది. ఆ వెంటనే నలుడి కోసం స్వయంవరం ఏర్పాటు చేసింది. దీని గురించి తెలుసుకున్న బుుతుపర్ణుడనే రాజు దమయంతి స్వయంవరానికి హాజరవ్వాలని భావించాడు.

దీంతో తన వద్ద సేవకుడిగా ఉన్న నలుడిని గుర్రాలను తోలమని చెప్పి స్వయంవరానికి బయలుదేరాడు. అయితే నలుడికి అశ్వ హృదయం తెలుసట. అంటే గుర్రం మనసులో ఏముందో తెలుసుకోగలడట. దీంతో అనుకున్న సమయానికి చేరాల్సిన ప్రదేశానికి చేరేవాడు. అయితే బుుతుపర్ణుడికి సైతం అక్ష హృదయం అనే విద్య గురించి తెలుసు. అంటే ఒక చెట్టుకు ఎన్ని ఆకులున్నాయి. ఎన్ని పండ్లు కాయబోతున్నాయి? వంటి విషయాలను ముందే గ్రహించి చెప్పగలడు. దీంతో తమకు తెలిసిన విద్యలను ఒకరొకరు నేర్పించుకున్నారట. మహాభారతంలో శకునికి కూడా అక్ష హృదయం విద్యను ఉపయోగించే డైస్‌లో ఏ నంబర్ పడబోతోందో ముందుగానే తెలుసుకుని ధర్మరాజుపై విజయం సాధించాడు.
