కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయం ఖమ్మం జిల్లాలో ఎక్కడుందంటే..

పరమేశ్వరుడు ప్రతి గ్రామంలోనూ కొలువుదీరి ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రతి చోటా శివాలయం ఉంటుంది. అయితే వాటిలో కొన్ని ఆలయాలు వాటి చారిత్రక నేపథ్యం కారణంగా ప్రసిద్ధి గాంచాయి. శివుడు భోళాశంకరుడు. ఒక చెంబుడు నీళ్లతో అభిషేకించినా చాలు పొంగిపోయి వరాలిచ్చేస్తాడని చెబుతారు. అలాంటి శివయ్యకు ఎందరో రాజులు ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు. అలా రాజులు నిర్మించిన ఆలయాల్లో ఒక చారిత్రక ప్రసిద్ధి గాంచిన ఆలయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కాకతీయుల కాలంలో శివాలయాల నిర్మాణం విస్తృతంగా జరిగింది.

కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయం ఖమ్మం జిల్లాలో ఎక్కడుందంటే..
కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయం ఖమ్మం జిల్లాలో ఎక్కడుందంటే..

కాకతీయ రాజులంతా శివ భక్తులే. దీంతో అనేక ప్రాంతాల్లో శివాలయాలను నిర్మించి ఆ ఈశ్వరునిపై తమ భక్తిని చాటుకున్నారు. కాకతీయులు శివాలయాల నిర్మాణంలో తమ ప్రత్యేకతను చాటారు. కాకతీయులు నిర్మించిన ఆలయాల్లో వారి నిర్మాణ శైలి మనకు స్పష్టంగా తెలుస్తుంది. నాటి కాకతీయుల వైభవాన్ని చాటే ఆలయాల్లో ఖమ్మం జిల్లాలోని కూసుమంచి శివాలయం ఒకటి. ఈ ఆలయాన్ని గణపతిదేవుడు నిర్మించినట్టు ఆలయంలో లభించే శాసనాల ఆధారంగా తెలుస్తోంది. కూసుమంచిలో కొలువుదీరిన శివయ్యను రామలింగేశ్వరస్వామిగా పేర్కొంటారు. ఈ ఆలయాన్ని 11-12వ శతాబ్దాల మధ్య నిర్మించినట్టుగా తెలుస్తోంది.

Share this post with your friends