గుడిలో గంట ఎందుకు కొడతారు?

మనం గుడిలోకి వెళ్లగానే ముందుగా చేసే పనేంటి? గంట కొట్టడం.. మరి ఆ గంట ఎందుకు కొట్టాలన్న సందేహం వచ్చిందా? అంతా కొడుతున్నాం కాబట్టి మనం కూడా కొట్టేద్దాం అనుకునే వారు కొందరైతే.. ఎందుకని ఆలోచన చేసే వారు కూడా కొందరుంటారు. గుడిలో గంట ఎందుకు కొట్టాలనే ధర్మ సందేహం రావొచ్చు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటేంటంటే.. మనం వచ్చామని గుడిలోని దేవతలకు తెలియజెప్పడం. మరో కారణమేంటంటే.. గుడిలో గంట మోగించడం వల్ల మనం చేసిన వంద జన్మల పాపాలు పోతాయట. ఈ విషయాన్ని స్కంద పురాణం చెబుతోంది.

శాస్త్రీయ కారణం కూడా ఒకటుంది. అదేంటంటే.. గంట కొట్టినప్పుడు వచ్చే శబ్ద కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియాతో పాటు వైరస్‌ వంటి వాటిని నాశనం చేస్తాయట. మనసులో ఉండే ఉద్విగ్నతను లయబద్దమైన గంట శబ్దం తొలగించి తద్వారా మనసుకు శాంతిని చేకూరుస్తుంది. దేవుడి ముందు గంట కొట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నేరుగా భగవంతుడిని చేరుతుందని భక్తులు నమ్ముతారు. ఇక ఇళ్లలోనూ పూజా సమయంలో గంట కొడతారు కదా.. అదెందుకంటే.. ఇళ్లలో పూజా సమయంలో గంట కొడితే అది మన మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగజేయడంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

Share this post with your friends