నిజమైన ధనవంతుడెవరు? లోకంలో అత్యంత శక్తివంతమైనదేది?

నిజమైన ధనవంతుడు ఎవరు? అంటే దానం చేసే వాడే నిజమైన ధనవంతుడు. ఎందుకంటే పంచే మనసు ఉన్నవాడే గొప్పవాడు. ఇతరుల బాధ చూసి స్పందించేవాడు ధనవంతుడు. ధనం కంటే హృదయం విలువైనది. దానం చేసే వ్యక్తి సమాజానికి వెలుగునిస్తాడు. అలాగే యక్ష ప్రశ్నల్లో ఒకటి.. లోకంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి? అంటే.. సహనమే శక్తివంతమైనది ఎందుకంటే సహనం ఉన్నవాడు ఏ పరిస్థితినైనా జయిస్తాడు. సమస్యలు తేలికపడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విజయానికి దగ్గర చేస్తుంది.

యక్ష ప్రశ్నల్లో మరొకటి.. మనిషిని నాశనం చేసే మూడు విషయాలు ఏమిటి? లోభం మనిషిని నాశనం చేస్తుంది. క్రోధం మనిషిని దారి తప్పిస్తుంది. మోహం బుద్ధిని దెబ్బతీస్తుంది. ఇవన్నీ చివరికి జీవితం అస్థిరం చేస్తాయి. తెలివైన వారు ఎవరు? అంటే.. సమయం చూసి మాట్లాడేవారే తెలివైనవారు ఎందుకంటే సరైన సమయంలో సరైన మాట చాలా శక్తివంతం. శాంతితో ఆలోచించడం జ్ఞానం. పరిపక్వత సంబంధాలను బలపరుస్తుంది. తెలివైనవాడు సమస్యలు కాకుండా పరిష్కారాలు తీసుకొస్తాడు.

Share this post with your friends